ఎరువుల యాప్‌లో లోపాలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్' (ఎఫ్ఎఫ్ఎస్) యాప్‌లో భూముల విస్తీర్ణ లెకలు తారుమారవడంతో తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. రాష్ట్ర రెవెన్యూ రికార్డుల్లో భూమిని ‘ఎకరాలు-గుంటలు’గా నమోదు చేస్తుండగా..
- భూముల విస్తీర్ణ లెకల్లో తేడాలు
- యూరియా కేటాయింపులో కోత
- కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన చౌటుపల్లి రైతు శ్రీనివాసరావు
- ఎట్టకేలకు సమస్య పరిష్కారం
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్రేమ్‌వర్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్’ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్‌లో భూముల విస్తీర్ణ లెకలు తారుమారవడంతో తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. రాష్ట్ర రెవెన్యూ రికార్డుల్లో భూమిని ‘ఎకరాలు-గుంటలు’గా నమోదు చేస్తుండగా.. ఆ వివరాలను ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో ‘సెంట్లు’ లేదా ‘డెసిమల్ ఎకరాలు’గా మార్చడంలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఎకరం 20 గుంటల (1.50 ఎకరాల) భూమిని ఈ యాప్ కేవలం 1.20 ఎకరాలుగా లెకిస్తున్నది. ఈ పొరపాటు వల్ల భూమి విస్తీర్ణం తగ్గిపోయి రైతులకు రావాల్సిన ఎరువుల కోటా గణనీయంగా తగ్గిపోతున్నది.
ఎకరాకు కేవలం 2 బస్తాల యూరియా మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ సమస్యపై వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన రైతు మట్టపల్లి శ్రీనివాసరావు కేంద్ర వ్యవసాయ, రసాయనాలు-ఎరువులశాఖ మంత్రులతోపాటు ప్రధాని కార్యాలయం (పీఎంవో), తెలంగాణ సీఎంవోకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని పట్టాదారు పాసుపుస్తకాల్లో ఉన్న వాస్తవ విస్తీర్ణానికి, యాప్‌లో చూపిస్తున్న కొలతలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉన్నట్టు ఆయన ఆధారాలతో చూపారు. యాప్‌లో తకువ విస్తీర్ణం చూపడం వల్ల ఎరువుల బస్తాల కేటాయింపులో భారీ కోత పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు, సర్వర్ లేదా డాటా ఫెచింగ్ వైఫల్యాలు ఎదురైనప్పుడు రైతులకు ఎరువులు నిరాకరించకుండా ప్రత్యామ్నాయంగా మాన్యువల్ విధానంలో లేదా వ్యవసాయ అధికారుల ధృవీకరణ ద్వారా ఎరువులు అందించేందుకు మార్గదర్శకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రెవెన్యూ రికార్డులకు అనుగుణంగా యాప్‌లోని ఆల్గారిథమ్ను వెంటనే సరిచేయాలని, రైతులకు తెలుగులో వివరాలు చెప్పగలిగేలా సహాయ కేంద్రాలు (హెల్ప్‌డెస్) ఏర్పాటు చేయాలని, సాగు సమయానికి తగినంత ఎరువులు అందేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. ఎరువుల యాప్‌లో భూవిస్తీర్ణ లెక్కలను (1 ఎకరం = 40 గుంటలు = 100 సెంట్లు, 1 గుంట = 2.5 సెంట్లు ప్రాతిపదికన) సవరించారు. ఈ సవరణ వల్ల ఎఫ్ఎఫ్ఎస్ పోర్టల్‌లో రైతుల నమోదిత భూవిస్తీర్ణం పెరిగింది. తదనుగుణంగా ఎకరానికి 2 బస్తాల చొప్పున రావాల్సిన సబ్సిడీ యూరియా కోటా న్యాయబద్ధంగా పెరిగింది. ఈ విజయాన్ని తెలంగాణలోని రైతులందరికీ అంకితం చేస్తున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

