సీఎం రేవంత్ సభ నేపథ్యంలో దివ్యాంగుల సంఘం నేతల అరెస్టు
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఎప్పుడు, ఎక్కడ జరిగినా.. నిర్బంధాలు, అరెస్ట్‌లు పరిపాటిగా మారాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులు పలువురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
కల్వకుర్తి/అమ్రాబాద్, నవంబర్ 9 : సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఎప్పుడు, ఎక్కడ జరిగినా.. నిర్బంధాలు, అరెస్ట్‌లు పరిపాటిగా మారాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులు పలువురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తిలో ఉంటున్న దివ్యాంగుల సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్యను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అలాగే అమ్రాబాద్ మండలం ఈగలపెంటకు చెందిన సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి రాజశేఖర్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. మూడు చక్రాల వాహనం లేనిదే అడుగు ముందుకు వేయలేని వీరిద్దరూ దాదాపు 120 కి.మీటర్ల నుంచి 180 కి.మీటర్ల దూరంలోని కొడంగల్‌లో మూడు, నాలు గు అంచెల భద్రత వ్యవస్థ మధ్య జరుగుతున్న రేవంత్‌రెడ్డి సభకు వెళ్లి నిరసన తెలుపడం సాధ్యమయ్యేనా? అని పలువురు ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

