హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): టీచర్ల ప్రమోషన్లకు బ్రేక్‌పడింది. ఈ నెల 11 వరకు హైకోర్టు స్టే విధించడంతో తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యాశాఖ అధికారులు డీఈవోలు, ఆర్జేడీలకు సమాచారమిచ్చారు. 2002 నవంబర్‌లో కొందరు టీచర్లకు పదోన్నతులిచ్చారు. ఇదే సంవత్సరంలో డీఎస్సీ ద్వారా కొందరు టీచర్లను నియమించారు. దీంతో సీనియార్టీ జాబితాపై వివాదమేర్పడింది. తమకు నోషనల్ సీనియార్టీ ఇవ్వాలంటూ కొందరు హైకోర్టు డివిజన్ బెంచీని ఆశ్రయించగా, హైకోర్టు స్టే విధించడంతో అధికారులు 11 వరకు పదోన్నతులు నిలిపివేశారు.