హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): పాత పెన్షన్ను సాధించే పోరాటంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా భాగస్వామ్యం కావాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 1న పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ధర్నాచౌక్లో నిర్వహించే పెన్షన్ విద్రోహదినం మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ ధర్నాకు వచ్చే వారంతా నలుపు రంగు టీషర్ట్లు, చొక్కాలు, చీరలతో హాజరుకావాలని సూచించారు.