హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తరాల జగదీశ్‌తో కలిసి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఏపీలో మాడల్ స్కూల్స్‌ను విద్యాశాఖలో విలీనంచేశారని, ఇక్కడ కూడా విద్యాశాఖలో విలీనంచేయాలని కోరారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు సొమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.