హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గురువారం రాత్రి నుంచి దరఖాస్తుల స్వీకరణ షురూ కాగా, శుక్రవారం వరకు 775 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
తొలి రోజు పేపర్-1కు 214, పేపర్-2కు 431, రెండు పేపర్లకు 130చొప్పున మొత్తం గా 775 దరఖాస్తులొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక ఫీజును ప్రభుత్వం తగ్గించింది. ఒక పేపర్‌కు రూ.వెయ్యి ఉండగా, రూ.750కి తగ్గించింది. రెండు పేపర్ల ఫీజును రూ. వెయ్యికి తగ్గించింది.