ఈ చాయ్ వెయ్యి రూపాయలు!

- హైదరాబాద్‌లో మైజాన్ టీ ఘుమఘుమలు
- కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిలోఫర్ కేఫ్
హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఒక్క చాయ్ వెయ్యి రూపాయలు! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముదురు బంగారు వర్ణం.. గమ్మత్తైన సు వాసన.. మైమరపించే రుచి.. అద్భుతమైన అనుభూతి.. ఇలాంటి విశేషణాలేవీ ఈ స్పెషల్ చా య్‌ను వర్ణించడానికి సరిపోవు. అమోఘమైన చాయ్ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. హైదరాబాద్‌లోని నిలోఫర్ కేఫ్‌లో ఈ అద్భుతమైన చా య్‌ను ఎంచక్కా సిప్ చేయొచ్చు. ఈ చాయ్ త యారీకి వినియోగించే పత్తా అత్యంత అరుదైనది. అస్సోంలోని బ్రహ్మపుత్ర నదీ తీరప్రాంతంమైజాన్ టీ తోటల్లో మాత్రమే లభిస్తుంది. మైజా న్ గోల్డెన్ టిప్స్‌గా పేరొందిన తేయాకు మొగ్గలు ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా లభిస్తాయి. వాటిని సూర్యోదయానికి ముందే సేకరించాల్సి ఉంటుంది. తెలతెలవారకముందే సేకరించిన ఆ మొగ్గలను ఆరబెట్టి, పొడి గా చేస్తారు. ఇలాంటి పొడి ఎప్పుడో ఒకసారి కిలో, కిలోన్నర పరిమాణంలోనే ఉత్పత్తి అవుతుంది. దీనికి డిమాండ్ ఎక్కువ కాబట్టి వేలంద్వారా విక్రయిస్తారు. కోల్‌కతాలో నిర్వహించిన వేలంలో నిలోఫర్ కేఫ్ యజమాని బాబూరావు దీనిని రూ.75 వేలకు చేజిక్కించుకొన్నారు. దాని తో తయారుచేసిందే ఈ చాయ్. దీని తయారీలో మరో ప్రత్యేకత పాలు అసలు వాడకపోవడం. డి కాషన్ రూపంలోనే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక కప్పు టీ తయారీ కోసం 4 గ్రాముల మైజాన్ గోల్డెన్ టిప్స్‌ను వినియోగిస్తామని చెప్తున్నారు నిలోఫర్ కేఫ్ యజమాని అనుముల శశాంక్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

