హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార అవకాశాలను అందించడానికి టీ హబ్..టీ బ్రిడ్జ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీ హబ్ కేంద్రంగా పలు రంగాల్లో ఆవిష్కరణలు చేసిన స్టార్టప్‌లకు ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఏర్పాటు చేయడానికి టీ బ్రిడ్జీ వేదికగా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. శుక్రవారం టీ హబ్‌ను ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ)కు చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా స్టార్టప్ నిర్వాహకులతో ప్రత్యేకంగా నెట్వర్క్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రికార్డు ర్యాలీకి బ్రేక్
ముంబై, సెప్టెంబర్ 13: స్టాక్ మార్కెట్ల రికార్డు ర్యాలీకి బ్రేక్‌పడింది. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో సూచీలు నష్టపోయాయి. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి ఇంట్రాడేలో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 71.77 పాయింట్లు కోల్పోయి 82,890.94 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 32.40 పాయింట్లు కోల్పోయి 25,356.50 వద్ద స్థిరపడింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ షేరు అత్యధికంగా 2 శాతం వరకు నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది.