సూర్యాపేట : తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడిన టీటీడీపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు( Bakkani Narsimhulu ) తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ యువజన సంఘం( Telangana Yuvajana Sangam) డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బక్కని నర్సింహులు దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు ( Madhu ) మాట్లాడుతూ నిన్న మంగళగిరి లోజరిగిన టీడీపీ జాతీయ మహానాడులోతెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా బక్కని నర్సింహులు మాట్లాడారని,తెలంగాణ అనే పదం ‘ డిక్షనరి ’లో లేదని అవమాన పరిచాడని ఆరోపించారు.తెలంగాణ అనేది డిక్షనరిలో వెతికేందుకు ఒక పదం కాదని,నాలుగు కోట్ల ప్రజల అస్తిత్వ, ఆత్మ గౌరవ పోరాట ప్రాంతమని గుర్తు చేశారు.
వందలాది సంవత్సరాల క్రితమే త్రిలింగదేశంగా వర్ధిల్లిన ప్రాంతం తెలంగాణ అని,తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ గురించి స్పష్టంగా పేర్కొనబడిందని తెలిపారు. చరిత్ర చదవకుండా, సీమాంద్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషిపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు సంతోష్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, జిల్లా నాయకులు దారవత్ వెంకటేష్ నాయక్, జక్కలి గోపి, చింతకాయల మహేష్, లావుడ్యా బాలాజీ నాయక్,పోలోజు మహేష్ చారి,తదితరులు పాల్గొన్నారు.