TAUK | లండన్‌లో బోనాల జాతర.. పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) ఆధ్వర్యంలో జూన్ 25న బ్రిటన్ రాజధాని లండన్‌లో బోనాల జాతర (London Bonala Jathara) జరుగనుంది. వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) ఆధ్వర్యంలో జూన్ 25న బ్రిటన్ రాజధాని లండన్‌లో బోనాల జాతర (London Bonala Jathara) జరుగనుంది. వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. యూకేలో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు www.tauk.org.uk వెబ్‌సైట్‌ని సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

