హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావును మహాత్మాఫూలే పురస్కారం వరించింది. సోమవారం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 23వ తానా ముగింపు మహాసభలో పురస్కారం ప్రదానం చేశా రు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు, ప్రపంచ తెలుగు సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర.. వకుళాభరణానికి పురస్కారం అంద జేసి, సన్మానించారు. వకుళాభరణం మాట్లాడుతూ.. తానా మహాసభలో ఈసారి సామాజిక న్యాయం కోణంలో బహుజన వాదంపై సమాలోచనలు చేయడం గొప్ప విషయమని చెప్పారు.
తానా మహాసభల ముగింపు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తెలుగుదనం ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తానా కొత్త అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ప్రమాణ స్వీకారం చేశారు. ముగింపు సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉపన్యాసం ఇచ్చారు. తానా సేవా కార్యక్రమాలు ఆదర్శమని చెప్పారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థకు ఎన్వీ రమణ చేసిన కృషిని కీర్తిస్తూ న్యూజెర్సీ రాష్ట్రం సెనెట్, జనరల్ అసెంబ్లీ ప్రశంసించాయి.