హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరసరించడాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. గవర్నర్ రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, దేశంలో ఇంతవరకు ఏ గవర్నర్ కూడా ఇంత శాడిస్టులా వ్యవహరించలేదని చెప్పారు.
బీజేపీ డైరెక్షన్ లో గవర్నర్ తమిళిసై పనిచేస్తూ క్యాబినెట్ నిర్ణయాలను తిరసరిస్తున్నారని ఆరోపించారు. అట్టడుగు వర్గాల ప్రజలను గవర్నర్ అవమానించారని, రాబోయే రోజుల్లో ఈ చర్యకు నిరసనగా బీజేపీకి తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.