బిచ్కుంద : రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( Bichkunda Degree College ) విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్రస్థాయి జిజ్ఞాస (Curiosity ) పోటీలను నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా ఎకనామిక్స్ విభాగం లో సోషియో ఎకానమీ కండిషన్ ఆఫ్ బీడీ వర్కర్స్ ఎట్ బిచ్కుంద మండల్, చరిత్ర విభాగంలో కౌలాస్ పోర్ట్ ( Koulas Port ) హిస్టారికల్ మార్వెల్ అనే అంశాన్ని ఎంపిక చేసి పోటీలను నిర్వహించింది. హైదరాబాదులోని ఇందిర ప్రియదర్శిని నాంపల్లి కళాశాలలో నిర్వహించిన ప్రదర్శనలో కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.
కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్, ప్రొఫెసర్ జి .యాదగిరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె అశోక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.