మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 8: రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి నిర్వహిస్తున్నట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం మహబూబ్‌నగర్‌లో కంటి వెలుగు కార్యక్రమానికి ఎంపికైన 45 మంది ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.