హైదరాబాద్, జనవరి 23 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పీజీ అడ్మిషన్ల గురించి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందని టీ-శాట్ సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.
యూనివర్సిటీలోని కోర్సులు, ఏఏ భాషలు, ఎన్ని విభాగాల్లో అడ్మిషన్లు తదితర విషయాలను వివరించనున్నామని చెప్పారు. ఇదే కార్యక్రమం శనివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు విద్య చానల్లో ప్రసారమవుతుందని చెప్పారు.