హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ): జీవో 80 ప్రకారం పంచాయతీ కార్యదర్శుల బదిలీలను వెంటనే చేపట్టాలని టీ-పంచాయతీ కార్యదర్శుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక కరుణాకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీవోలో 40 శాతానికి మించి బదిలీలు చేయొద్దని ఉన్నదని, పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో జోన్లు, గ్రేడ్ల వారీగా 40 శాతం వరకు ఉండటమే లేదని తెలిపారు. కేవలం నాలుగేండ్లు పూర్తి చేసుకున్న కార్యదర్శులనే బదిలీ చేస్తున్నారని తెలిపారు.
దీంతో వారు 15 నుంచి 20 శాతం లోపే చాలా జోన్లలో, గ్రేడ్లలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జీవో 80 ప్రకారం రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 40 శాతం లోపల ఉన్న కార్యదర్శులకు వెంటనే బదిలీ చేయాలని కరుణాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.