T-Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేథస్సు, వెబ్ 3 టెక్నాలజీతో ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ హబ్‌లో ఫిన్టర్నెట్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో రకరకాల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్న స్టార్టప్‌లకు యాక్సిలరేటర్ ద్వారా పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు.
ఎక్స్‌డీసీ నెట్వర్క్ భాగస్వామ్యంతో స్టార్టప్‌లను ప్రారంభ దశ నుంచి మార్కెట్లోకి వెళ్లే వరకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయాన్ని ఫిన్టర్నెట్ యాక్సిలరేటర్ ద్వారా అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులు మరిన్ని వివరాలకు టీ హబ్‌ను సంప్రదించాలని తెలిపారు