హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఎకో సిస్టంతో దూసుకుపోతున్న టీహబ్ తాజాగా మరో అడుగు ముందుకేసింది. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ప్రముఖ సంస్థ చిరాటే వెంచర్ క్యాపిటల్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది.
ఈ మేరకు చిరాటే ప్రతినిధులు శనివారం టీహబ్‌లోని స్టార్టప్‌లతో సమావేశమయ్యారు. టీహబ్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌ల గురించి తెలుసుకొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకొంటున్నట్టు ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా టీహబ్‌లోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి కొన్ని స్టార్టప్‌లను ఎంపిక చేస్తామని, వాటిలో అవసరమైన మేరకు పెట్టుబడులు పెడతామని చిరాటే ప్రతినిధులు తెలిపారు.