యువత ఆవిష్కరణకు రెక్కలు తొడిగిన టీహబ్!
‘కలలకు రెకలు తొడగడం’ అనే నినాదానికి టీ హబ్ నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆవిషరణలు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలకు కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే దూరదృష్టితో కేసీఆర్ హయాంలో టీహబ్‌ను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. 11 ఏండ్ల ప్రస్థానంలో వేలాది మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి, వారి ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా మార్చేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసిందని ప్రశంసించారు.
- ప్రపంచ ఆవిషరణల పటంలో టీ హబ్‌తో హైదరాబాద్‌కు గుర్తింపు
- కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకొని 3,300కు పైగా ఆవిష్కరణలకు అండ
- రాష్ట్ర ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు
- టీహబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశంసలు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘కలలకు రెకలు తొడగడం’ అనే నినాదానికి టీ హబ్ నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆవిషరణలు, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలకు కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనే దూరదృష్టితో కేసీఆర్ హయాంలో టీహబ్‌ను ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశారు. 11 ఏండ్ల ప్రస్థానంలో వేలాది మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచి, వారి ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా మార్చేందుకు ఈ సంస్థ విశేషంగా కృషి చేసిందని ప్రశంసించారు. టీహబ్ తన 11 ఏండ్ల ప్రయాణం లో ఇప్పటివరకు 3,300కుపైగా స్టార్టప్‌లకు ప్రో త్సాహం అందించిందని వెల్లడించారు.
కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకొనే యువతకు మార్గదర్శకత్వం అందించడంతోపాటు అనుభవజ్ఞులైన మెంటార్లు, పెట్టుబడిదారులు, పారిశ్రామికరంగ ప్రముఖులతో అనుసంధానం కల్పించిందని తెలిపారు. ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్టార్టప్‌లకు వేదికగా నిలిచిందని గురువారం ఎక్స్ వేదికగా పేరొన్నారు. ఈ సందర్భంగా టీహబ్ ఫొటోను కూడా షేర్ చేశారు. కేవలం స్టార్టప్‌లకు కార్యాలయ వసతి కల్పించే సంస్థగానే కాకుండా, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తూ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే సమగ్ర ఆవిషరణల వ్యవస్థగా టీహబ్ ఎదిగిందని తెలిపారు. తెలంగాణ యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వం, పెట్టుబడుల అవకాశాలను అందించడంలో కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు.
పారిశ్రామిక స్ఫూర్తికి ప్రతీక
టీహబ్ విజయవంతమైన ప్రయాణం తెలంగాణ ఆకాంక్షలు, పారిశ్రామిక స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆవిషరణల కేంద్రాల ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిందని కేటీఆర్ పేరొన్నారు. ఈ సంస్థ ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఆవిషరణల రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలిపారు. టీహబ్ ప్రారంభోత్సవం సందర్భంగా దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.
టీహబ్‌ను ఆయన ఆధునిక భారతదేశ ముఖచిత్రంగా అభివర్ణించారని తెలిపారు. ఆ మాటలకు తగినట్టుగానే టీహబ్ నేడు దేశంలోని ప్రముఖ ఆవిషరణల కేంద్రాల్లో ఒకటిగా ఎదిగిందని వెల్లడించారు. 11 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీహబ్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ, యువ ఆవిషర్తలకు సాధికారత కల్పించి, వారి కలలను సాకారం చేసే దిశగా సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

