అన్నీ పార్టీల చూపు గులాబీ వైపు
బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. సాధారణ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే వలసల పర్వం ఊపందుకున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు గులాబీ పార్టీకి జైకొడుతున్న తీరు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
- బీఆర్ఎస్ పార్టీలో చేరికల హోరు
- మొన్న భార్గవ్ దేశ్‌పాండే.. నిన్న గంగారెడ్డి
- తాజాగా నిర్మల్ నేత నల్ల వినయ్‌రెడ్డి చేరిక
- గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. సాధారణ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే వలసల పర్వం ఊపందుకున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఇతర పార్టీల నాయకులు గులాబీ పార్టీకి జైకొడుతున్న తీరు రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. దీంతో ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీలో చేరికల జోష్ కనిపిస్తున్నది. గత అక్టోబర్ 25న ఆదిలాబాద్‌కు చెందిన కాంగ్రెస్ కీలక నేత, ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే, అక్టోబర్ 31న అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బెన్వార్ గంగారెడ్డి, అదేరోజున బీజేపీ నాయకులు ముత్యాల సురేశ్, కిష్టన్న చేరగా తాజాగా గురువారం నిర్మల్ జిల్లాకు చెందిన నల్ల వినయ్‌రెడ్డి కారు పార్టీలో చేరారు.
ఆయనకు హైదరాబాద్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలానికి చెందిన నల్ల వినయ్‌రెడ్డి, ఆయన కుటుంబానికి స్థానికంగా మంచి గుర్తింపు ఉన్నది. సమితి మాజీ ప్రెసిడెంట్ భీమ్‌రెడ్డి మనవడిగా అందరికీ సుపరిచితుడు. వారి కుటుంబ సభ్యులకు సైతం ప్రజల్లో ఆదరణ ఉన్నది. అన్ని వర్గాలతో బలమైన అనుబంధం కలిగి ఉన్నది. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ నేతృత్వంలో రైతు గర్జన సభ నిర్వహించనున్న నేపథ్యంలో వినయ్‌రెడ్డి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆయన రాకతో పార్టీ మరింత పటిష్టం కానున్నదనే అభిప్రాయం వినిపిస్తున్నది.

పార్టీలో ‘నూతన’ ఉత్సాహం
సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీలోనైనా నిస్తేజం ఆవరిస్తుంది. ఎన్నికల ఏడాదిలోనే జోష్ కనిపిస్తున్నది. కానీ ఇందుకు భిన్నంగా బీఆర్ఎస్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తున్నది. ముఖ్యంగా ఆరునెలల నుంచి జోష్ కనిపిస్తున్నది. కాంగ్రెస్‌కు చెందిన అగ్రనేత జీవన్‌రెడ్డితో పాటు అనేక మంది కీలకనేతలు పార్టీలో చేరుతుండటం పెరుగుతున్న ఆదరణకు అద్ధంపడుతున్నది. ఇతర పార్టీలతో పాటు జిబ్రాన్ షరీఫ్, నల్ల వినయ్‌రెడ్డి లాంటి తటస్థులు సైతం గులాబీ పార్టీ లో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కొంతమేర బీజేపీ ప్రాబల్యం ఉన్న ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి యువకులు బీఆర్ఎస్లోకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS party
- KTR
- Nalla Vinay Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

