హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : మహిళల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ క్యాంపెయిన్ సోమవారం ముగిసింది. ఈ మేరకు వైద్యారోగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 5065 స్పెషలిస్టు క్యాంపులు, 41,153 స్క్రీ నింగ్ క్యాంపులు నిర్వహించినట్టు తెలిపింది. మొత్తం 20,78, 284మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు వెల్లడించారు.