బండ్లగూడ, ఆగస్టు 18 : బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బడుగు వర్గా లు ఏకంకావాలని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. పాపన్నగౌడ్ జ యంతిని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్ కిస్మత్‌పూర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుజన నాయకుడిగా సర్దార్ సర్వాయి పాపన్న అన్ని కులాలను ఏకం చేసి రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై పోరాడారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాపన్న స్ఫూర్తితో పాలన సాగిందని, వృత్తిదారుల సంక్షేమానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని కొనియాడారు. కానీ, ఈనాటి కాంగ్రెస్ సర్కార్ బీసీలను అణచివేసేందకు కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారమే.. నేడు ట్యాంక్‌బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటుకు నేటి ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు సదానంద్, రావుల కోళ్ల నాగరాజు, లక్ష్మీరాజ్, దుర్గేశ్, సురేశ్, నీరుడు శేఖర్, వీర అర్జున్‌గౌడ్, జగదీశ్‌గౌడ్, పాండుగౌడ్, నరసింహగౌడ్, సురేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.