ములుగు, జూలై 2 (నమస్తేతెలంగాణ): ఇంట్లో పనిచేయడం లేదని తన శాఖలో కింది స్థాయి మహిళా ఉద్యోగిపై రి మార్క్‌లు చూపిస్తూ రెండుసార్లు సస్పెండ్ చేసిన ఘటన ములుగు అటవీ శాఖలో చోటుచేసుకున్నది. బాధిత మహిళా ఉద్యో గి గట్టికొప్పుల భాగ్యలక్ష్మి మంగళవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాల యం వద్ద మీడియాకు వివరాలు వెల్లడించారు. భా గ్యలక్ష్మి అటవీ శాఖలో బంగ్లా వాచర్‌గా 2004లో ఉద్యోగంలో చేరారు. మంగపేట కార్యాలయంలో పనిచేయాల్సి ఉండగా ఓడీ బేసిస్‌లో డిప్యుటేషన్‌పై ములుగు రేంజ్ కార్యాలయంలో విధులు అప్పగించారు. కొంతకాలంగా డీఎఫ్‌వో రా హుల్ కిషన్‌జాదవ్ ఈమెతో ఇంటి పనులు చేయించుకుంటున్నాడు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా పనికి రాకపోవడంతో అక్టోబర్ 26న సస్పెండ్ చేశాడు. ప్రాథేయపడగా మూడు నెలల తర్వాత తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. మళ్లీ డీఎఫ్‌వో ఇంట్లో పని అప్పగించారు. ఈ ఏడాది మే 20న తన మనుమడి పుట్టిన రోజు ఉన్నదని డీఎఫ్‌వో భార్యకు చెప్పి ముందస్తుగా వెళ్లింది. దీంతో జూన్ 28న మరోమారు సస్పెండ్ చేశారని బాధితురా లు తెలిపింది. ఈ విషయం మంత్రి కొండా సురేఖ దృష్టికి కూడా వెళ్లిందని ఆమె పేర్కొంది. డీఎఫ్‌వో దంపతులు తనపై కక్షగట్టడంతో మనస్తాపంతో ఫారెస్టు కార్యాలయం భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తుండగా తోటి ఉద్యోగులు అడ్డుకున్నట్టు తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నది.