కాటారం, మార్చి 9 : ఇన్స్టాలో పరిచయమైన బాలికను కిడ్నాపర్ల గుట్టురట్టయింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో శనివారం జరిగిన బాలిక కిడ్నాప్ కేసులో సూర్యాపేట జిల్లా మల్కాపురం, మిర్యాలగూడకు చెందిన పొల్ల వేణు, పొన్న దిశాంత్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాటారం పోలీస్స్టేషన్లో అరెస్ట్ వివరాలను సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్ వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్కాపురానికి చెందిన వేణుకు మండల కేంద్రానికి చెందిన బాలిక పరిచయమైంది. బాలికను ట్రాప్చేసిన వేణు, దిశాంత్తో కలిసి పెళ్లి చేసుకుందామంటూ మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సై అభినవ్ రెండు టీంలను ఏర్పాటుచేసి నిందితులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.