VROs | ఖలీల్వాడి, డిసెంబర్ 27 : అవగాహన లేని వారిని సర్వేయర్లుగా నియమిస్తే ఊరుకునేది లేదని, ఆందోళనలు చేస్తామని ప్రభుత్వ సర్వేయర్లు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సర్వేయర్లు శుక్రవారం జిల్లా కేం ద్రంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూమాత అమలుపై, సర్వేఅండ్ ల్యాం డ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో నూతనంగా చేపట్టనున్న నియామకాలపైనా చర్చ జరిగింది. తెలంగాణ గెజిటెడ్ అసోసియేష న్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ.. సర్వేయర్లను నియమిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. గతంలో పనిచేసిన వీఆర్వోలకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు. ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వా రిని నియమిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. ప్రభుత్వం భూసమస్యలు లే కుండా చేస్తానని చెబుతూనే, కొత్త సమస్యలు సృష్టించడం సరికాదని చెప్పారు. కర్ణాటకలో చేపట్టిన విధానాన్ని ఇక్కడా అమలు చేస్తామనడం సరికాదన్నారు.
వనపర్తి టౌన్, డిసెంబర్ 27 : కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి సముచిత స్థానం లేదని ఎండీ నిరంజన్ బాబా శుక్రవారం తీవ్ర మనస్తాపంతో మీడి యా ముందు ఆవేదన వెలిబుచ్చారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తగా, జిల్లా , యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా .. పార్టీ అభివృద్ధి కోసం 18 ఏండ్లుగా పనిచేసినా ఎలాంటి పదవి లభించలేదని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ పదవులకు అర్హులం కాదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్లో పనిచేయని నాయకులకు పదవులు వస్తున్నాయని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. వనపర్తి కోర్టులో న్యాయవాదిగా చాలాకాలంగా పనిచేస్తున్నా.. కోర్టులో అదనపు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏజీపీ) పదవి ఆశించినా తనకు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు చెప్పారు.