హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : టీచర్ల సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజా ఆదేశాలిచ్చింది. ఇక రిటైరయ్యే టీచర్లు, ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లే టీచర్ల స్థానాలను సర్దుబాటులో భాగంగా సర్ప్లస్ టీచర్లతో నింపాలని డీఈవోలకు సూచించింది. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది.
బదిలీలు పారదర్శకంగా ఉండాలి: తపస్
హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : టీచర్ల తాత్కాలిక బదిలీలు పారదర్శకంగా పూర్తిచేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. జీవో-190 అమలును త్వరగా పూర్తిచేయాలని కోరుతూ శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. మాడల్ స్కూల్స్ టీచర్ల డీఏ ఎరియర్స్ 2021 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్నాయని, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్‌ను సైతం విడుదల చేయాలని కోరారు.