హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్(మార్కెటింగ్)గా ఎం సురేశ్ బాధ్యతలు స్వీకరించారు. జీఎం రవిశంకర్ పదవీ విరమణతో శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న సురేశ్ ఇక్కడికి బదిలీయ్యారు. సింగరేణి డీజీఎంలు ఎన్వీ రాజశేఖరరావు, తాడబోయిన శ్రీనివాస్, సత్తు సంజయ్ ఇతర అధికారులు సురేశ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొగ్గు రవాణా, రేకుల సంఖ్యపై సురేశ్ సమీక్షించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఇతర వినియోగదారులకు బొగ్గు సరఫరా అయ్యే లా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.