హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)ఎన్నికల్లో మేనేజింగ్ కమిటీ మెంబర్గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పబ్బ సురేశ్ గెలుపొందారు. ఢిల్లీలోని పీసీఐలో ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 1,357 మంది ఓటు హకు వినియోగించుకున్నారు. 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. సురేశ్ 773 ఓట్లతో కమిటీ మెంబర్గా ఎన్నికయ్యారు. సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్గా గెలుపొందడం సంతోషంగా ఉందని తెలిపారు.