హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ట్రాన్స్పోర్ట్ కమిషనర్(రెగ్యులర్)గా సురేంద్రమోహన్ సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థిక శాఖకు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులతోపాటు పలువురు ఆర్థిక శాఖ ఉద్యోగులకు సైతం కాళేశ్వరంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులిచ్చింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్.. ప్రాజెక్టుపై విచారణను సోమవారం నుంచి పునఃప్రారంభించారు.