దుండిగల్, జూన్ 21: భూతగాద విషయంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా సూరారం సీఐ ఆకుల వెంకటేశంను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా శుక్రవారం సాయంత్రం ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో ఓ భూవివాదం కేసులో రత్నాకరం సాయిరాజ్ అనే వ్యక్తిపై గతంలో కేసు నమోదైంది. అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే మూడు లక్షలు ఇవ్వాలని సీఐ వెంకటేశం డిమాండ్ చేశాడు. ఈ మేరకు రెండు లక్షలకు ఒప్పందం కుదరడంతో ఆ మొత్తాన్ని సీఐకి అందజేశాడు. ఆ తర్వాత అదే స్థలాన్ని డెవలప్మెంట్ చేసుకుంటానని సీఐని ఇటీవల సంప్రదించగా మరో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెంటనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం సాయంత్రం ముందస్తుగా రూ. లక్ష ఇచ్చేందుకు సీఐకి చెప్పాడు. ఆ మేరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ వెంకటేశంను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హజరుపర్చనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.