హైకోర్టు సీజేగా తపబ్రత చక్రవర్తి
నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అక్టోబర్ 26న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పి.శామ్ కోషి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది.
- సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు
హైదరాబాద్, అక్టోబర్ 26, నమస్తే తెలంగాణ : నాలుగు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అక్టోబర్ 26న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పి.శామ్ కోషి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది.
గౌహతి హైకోర్టుకు చెందిన జస్టిస్ మనష్ రంజన్ పాఠక్ ప్రస్తుతం గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయనను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ సింగ్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంది. ఈ నాలుగు సిఫారసులను సుప్రీంకోర్టు కొలీజియం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ గెజిట్ ప్రచురణతో ఈ నియామకాలు అమలులోకి వస్తాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

