హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితికి వివిధ దేశాల్లోని ఎన్నారైలు మద్దతు తెలుపుతున్నారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల వివరించారు. కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశంపై వివిధ దేశాల్లో నివసిస్తున్న అన్నిరాష్ట్రాల వారికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడగడుతామని తెలిపారు. అమెరికా, ఖతార్ పర్యటన అనంతరం సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో మహేశ్ బిగాల సమావేశమయ్యారు. తన పర్యటనలో తెలంగాణ వాళ్లే కాకుండా మిగతా రాష్ట్రాల ఎన్నారైలు మద్దతు ఇసున్నారని మంత్రికి చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్నారైల అభిప్రాయాలను, సూచనలను వివరించారు. మహేశ్ బిగాల కృషిని మంత్రి కేటీఆర్ అభినందించారు.