Spray | చేవెళ్ల రూరల్, ఫ్రిబవరి 22 : రైతులు పంట పొలాల్లో చీడ, పీడల నివారణకు పలు రకాల స్ప్రే డబ్బాలతో మందులను పిచికారి చేస్తూ.. కూలీల కొరతతో ఇబ్బదులు పడుతున్నారు. ఇందుకు భిన్నంగా ఓ రైతు వినూత్నంగా ఆలోచించి తన ట్రాక్టర్కు రూ. 3 లక్షలు కర్చు చేసి మందు పిచికారి చేసేలా స్పే యంత్రాన్ని ఏర్పాటు చేయించుకున్నాడు.
శంకర్పల్లి మండల పరిధి సంకేపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి పంటలకు చీడ, పీడల నివారణకు పొలాల్లో మందులు స్ప్రే చేసేందుకు అతి తక్కువ సమయంలో పిచికారి చేసేందుకు యూట్యూబ్లో వీడియోలు చూసి తన ట్రాక్టర్కు మందు పిచికారి చేసే స్ప్రే యంత్రాన్ని ఏర్పాటు చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. గుంటూరులో రూ. 3 లక్షలు వెచ్చించి స్ప్రే యంత్రాన్ని ట్రాక్టర్కు ఫిట్టింగ్ చేయించాడు. కేవలం ఐదు నిమిషాల్లో ఒక ఎకరం పంటకు మందు పిచికారి చేయవచ్చని, కూలీల కొరతతో ఈ ఆలోచన వచ్చిందని రైతు సత్యనారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటగా ఈ ట్రాక్టర్ స్ప్రే యంత్రాన్ని ఏర్పాటు చేయించానని ఆయన పేర్కొన్నాడు.