చొప్పదండి,సెప్టెంబర్ 8 : మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై కాంగ్రెస్ గూండాల దాడి సిగ్గుమాలిన చర్య అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గూండాలకు పోలీసుల ఎసార్ట్ ఇచ్చి మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై దాడికి పంపుతారా? అని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసం వద్దకు ఎందుకు వెళ్లారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తెలంగాణ సాధకుడు కేసీఆర్‌ను రాజకీయంగా ఎదురోలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆయనను చంపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భద్రత విషయంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావును కోరుతూ దారుణ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఆవరణలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ పర్సనల్ సెక్రటరీ (పీఎస్) కే కృష్ణమోహన్ రాజు (52)ఆకస్మికంగా మృతిచెందారు. మంగళవారం విధుల్లో భాగంగా అసెంబ్లీకి వచ్చిన ఆయన గుండెపోటుకు గురై కుప్పకూలారు. మంత్రి వాకిటి శ్రీహరి సహా వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేశారు. మెరుగైన చికిత్స కోసం దవాఖానకు తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
హైదరాబాద్, సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటోడ్రైవర్ల ఉపాధి నాశనం చేసిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 215మందికిపైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆటో యూనియన్ నాయకులు ఆ వేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆటో యూనియన్ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, శాతం రమేశ్, పాషా ప్రకటన విడుదల చేశారు. సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చలు సఫలం కాలేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యకు పరిష్కారం చూపకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.