రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
గ్రామాలలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోళ్ల వద్దకు వచ్చే ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు కలుగకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.
హత్నూర,అక్టోబర్ 28 : గ్రామాలలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోళ్ల వద్దకు వచ్చే ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు కలుగకుండా వెంట వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్, చందాపూర్ గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గత కొనుగోల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరెంటు సమస్య వల్ల రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగుచేసిన పంట కళ్లముందు ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో నేడు రైతన్నలు పడ్డారని తెలిపారు.
ప్రభుత్వం వర్షాభావ పరిస్థితుల వల్ల యాసంగి పంటలు సాగు చేయవద్దని సూచించడంతో రైతులకు ఆర్థిక సాయంగా ఎకరాకు 30 వేల పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింలు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, సర్పంచ్‌లు రాధా రమేష్, రామరాజు, ఎల్లయ్య, ఉపసర్పంచ్ రాజ మల్ల రెడ్డి, ఆగమయ్య, కృష్ణ యాదవ్, ఇబ్రహీం, నరేందర్, రవీందర్,వీరేందర్, ఎల్చాల మధు,రవి కుమార్, కుమార్ అజ్మత్ అలీ,సురేందర్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
Back Pain Problem | యువతను అధికంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్య.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ఇరువురి మధ్య గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళ మృతి
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

