హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్టలో వేదపాఠశాల ఏర్పాటు చేసేందుకు ముహూర్త నిర్ణయం కోసం రాష్ట్ర దేవాదాయశాఖ కంచి పీఠాన్ని సంప్రదించింది. మే 23న భూమిపూజ నిర్వహించడానికి ముహూర్తంపై కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతిని శుక్రవారం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి, యాదాద్రి ఈవో భవానీశంకర్ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సరస్వతీ పుష్కరాల ముగింపు వేడుకలపై కంచి పీఠాధిపతితో చర్చించినట్లు సమాచారం.