క్లోమంలో కణితితో షుగర్
మధుమేహ సమస్య లేకుండానే ఆ లక్షణాలతో బాధపడుతున్నదో మహిళ. మూర్ఛ, కండ్లు తిరిగి పడిపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్నది
- పది లక్షల మందిలో ఒకరికి సోకే వ్యాధి
- విజయవంతంగా తొలగించిన కిమ్స్ వైద్యులు
బేగంపేట్, డిసెంబర్ 23: మధుమేహ సమస్య లేకుండానే ఆ లక్షణాలతో బాధపడుతున్నదో మహిళ. మూర్ఛ, కండ్లు తిరిగి పడిపోవటం వంటి సమస్యలతో సతమతమవుతున్నది. ఏమిటా? అని దవాఖానకు వెళ్తే.. క్లోమంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. దానివల్లే షుగర్ సమస్య వచ్చిందని తేల్చారు. పది లక్షల మందిలో ఒకరికి వచ్చే ఆ కణితిని కిమ్స్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ గౌతమ్ పాండురంగ శుక్రవారం దవాఖానలో మీడియాకు వెల్లడించారు.
ఓ గృహిణి(36) పదేండ్లుగా మూర్ఛతో ఇబ్బంది పడుతున్నది. తరచూ కండ్లు తిరిగి పడిపోతున్నది. దీంతో ఆమె కిమ్స్‌లో చేరింది. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్‌దాస్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ స్మిత నల్లాలు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఇన్సులినోమా సమస్య ఉన్నదని తేల్చారు. క్లోమంలో కణితి వల్ల ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మధుమేహం వస్తున్నదని గుర్తించారు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ సిద్ధాచారి నేతృత్వంలో డిస్టల్ పాంక్రియాటెక్టమీ శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KIMS Hospital
- Sugar
- Tumor
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

