చిక్కడపల్లి, అక్టోబర్ 19: జీవిత పర్యంతం వస్తువులే ఆస్తిపాస్తులుగా నమ్మిన నిజమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సుద్దా ల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
ప్రముఖ కళాకారుడు అరుణోదయ నాగన్నకు సుద్దాల హనుమంతు -జానకమ్మ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక మాట్లాడుతూ నాగన్న గొప్ప గాయకుడని కొనియాడారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ నాగన్న 50 ఏండ్లుగా ప్రజాపాటలే ఉచ్ఛాస నిశ్వాసలుగా రాజీపడని పాటకు వెయ్యేళ్లని నమ్మిన వ్యకి అని పేర్కొన్నారు.