చిక్కడపల్లి,అక్టోబర్ 14: సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు- జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అరుణోద య నాగన్నకు ఈ నెల 19న ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఈ కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రజాకవి సుద్దాల హనుమంతు జీవితాంతం పస్తులే ఆస్తిపాస్తులుగా నమ్మిన నిజమైన ప్రజాకవిగా పేర్కొన్నారు. నాగన్నకు పురస్కారంతో పాటు రూ. 25వేల నగదు బహుమతిని కూడా అందజేస్తామని చెప్పారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్, ఓయూ ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్, ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, డాక్టర్ పోరెడ్డి రంగన్న తదితరలు హాజరవుతున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజా సాం స్కృతిక కేంద్రం రాష్ర్టాధ్యక్షు డు భూపతి వెంకటేశ్వర్లు, తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్.సోమయ్య, సుజావతి తదితరులు పాల్గొన్నారు.