మహబూబ్‌నగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ పాలమూరులో శుక్రవారం సుదర్శన హోమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీరాజరాజేశ్వరీ ఆలయ ఆవరణలో టీఆర్ఎస్ నాయకుడు బుక్కా మోహన్‌బాబు సతీసమేతంగా ఈ హోమాన్ని జరిపించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా గణపతి, శ్రీమహాలక్ష్మి సహిత హోమాన్ని వైభవంగా నిర్వహించారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ నిండు నూరేండ్లు ప్రజల ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని పూజించారు. భవిష్యత్తులో కేసీఆర్ దేశానికి దిశా నిర్దేశం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.