హైదరాబాద్, డిసెంబర్8 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్‌ను సిరిసిల్లలోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆదివారం సందర్శించారు. స్టడీ టూర్లో భాగంగా కళాశాలకు చెందిన డిజైన్, టెక్నాలజీ కోర్సు విద్యార్థినులు ఈ టూర్లో పాల్గొన్నారు. నిఫ్ట్‌లోని వివిధ విభాగాలను వారు పరిశీలించారు. ఫ్యాషన్, టెక్నాలజీ రంగాల నూతన పోకడలను అక్కడి నిపుణుల ద్వారా తెలుసుకున్నారు. నిఫ్ట్ కావ్వొకేషన్-2024కి హాజరైన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, డైరెక్టర్ ప్రొఫెసర్ మాలినీ దివాకళ తదితరులను ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా కలిశారు.