యూకేవైపు విద్యార్థుల చూపు

- అక్కడ చదివేందుకు 75% మొగ్గు
- లివరేజీ ఎడ్యు సర్వేలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో విద్య అభ్యసించాలని ఆశపడుతున్న విద్యార్థుల్లో అత్యధికులు యూకే వైపు చూస్తున్నారు. ఇంతకాలం అమెరికా, ఆస్ట్రేలియాలను ఎంచుకోగా, ఈ ఏడాది విద్యార్థులు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. విదేశాల్లో విద్యకోసం వెళ్లేవాళ్లలో దాదాపు 75 శాతం విద్యార్థులు యూకేను ఎంచుకుంటున్నట్టు లివరేజీ ఎడ్యు సర్వేలో వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్నవారిలో 94 శాతం విద్యార్థులు ఈ ఏడాది విదేశీ చదువులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని అభిప్రాయపడగా, అత్యధికులు మేనేజ్మెంట్, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తేలింది. కరోనా నేపథ్యంలో ఇటీవలే యూకే, అమెరికాలు ఇమ్మిగ్రేషన్ను ప్రారంభించి వీసా స్లాట్లను కేటాయిస్తున్నాయని, దీంతో ఫారిన్ ఎడ్యుకేషన్ను ఎంచుకొనే విద్యార్థుల సంఖ్య రెట్టింపయినట్టు లివరేజీ ఎడ్యు వ్యవస్థాపకుడు అక్షయ్చదుర్వేది అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ఒక్క యూకేలో మాత్రమే ముఖాముఖి తరగతులను ప్రారంభించారని, విద్యార్థులకు అక్కడి ప్రభుత్వమే వ్యాక్సిన్లు వేయిస్తున్నదని, దీని ఫలితంగా అత్యధికులు యూకేవైపు చూస్తున్నట్టు ఆయన వివరించారు.
సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు..
- 75 శాతం విద్యార్థులు తమ చదువుల కోసం యూకేను ఎంచుకుంటుండగా, కెనడాను 13 శాతం, అమెరికాను 9 శాతం విద్యార్థులు ఎంపికచేసుకుంటున్నారు.
- 71 శాతం విద్యార్థులు యూకేలో మంచి అవకాశాలతోపాటు ఉత్తమ వైద్యసదుపాయాలుండటం సైతం ఆ దేశాన్ని ఎంచుకోవడానికి ముఖ్యకారణమని చెప్పారు.
- 60 శాతం విద్యార్థులు ప్రయాణ చార్జీలు, ఫీజులను విద్యారుణాల ద్వారా సమకూర్చుకుంటున్నామని తెలిపారు.
- 3 నెలల నుంచే విదేశీ విద్యకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని 58 శాతం విద్యార్థులు చెప్పగా, 36 శాతం మంది చాలా కాలంగా ప్రయత్నిస్తుమని పేర్కొన్నారు.
- 59 శాతం విద్యార్థులు ఈ ఏడాది విదేశీ చదువుల గమ్యస్థానాన్ని మార్చకూడదని నిర్ణయించుకోగా, 28 శాతం విద్యార్థులు మరో దేశం నుంచి గమ్యస్థానాన్ని యూకేకు మార్చుకోవాలనుకుంటున్నామని అన్నారు.
- అంతర్జాతీయ విద్యార్థులకు టీకా వేయాలన్న ప్రభుత్వ చొరవతోనే యూకేను ఎంచుకుంటున్నామని 2/3 విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
- అత్యధిక మంది విద్యార్థులు మేనేజ్మెంట్, బిజినెస్ కోర్సులను అభ్యసించేందుకే ఆసక్తిచూపుతున్నారు. 35 శాతం మంది మేనేజ్మెంట్, బిజినెస్ కోర్సులను ఎంపిక చేసుకుంటుండగా, 18 శాతం విద్యార్థులు ఇంజినీరింగ్, మరో 9 శాతం విద్యార్థులు డాటాసైన్స్ అనలిటిక్స్ కోర్సులను ఎంచుకుంటున్నారు.
- సర్వేలో పాల్గొన్నవారిలో 60% విద్యార్థులు విదేశీ వర్సిటీలను సంప్రదించగా, కరోనా నేపథ్యంలో కావాల్సిన సమాచారాన్ని వర్సిటీలు సమకూరుస్తున్నాయని, కోర్సులు, వర్సిటీల ఎంపికకు సంబంధించిన సమాచారం ఉపయుక్తంగా ఉన్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

