హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. హైదరాబాద్‌లోని భాష్యం పాఠశాలకు చెందిన బీ సూర్యరిషి 600కి 593 మార్కులు సాధించినట్టు హైదరాబాద్ భాష్యం జడ్‌ఈవో శిరీష తెలిపారు. కే ఆదిత్య 592, ఎన్ లాస్యశ్రీ 592, ఈ రక్షిత్ 591, ఆర్ కిరణ్‌కుమార్ 591, పీ ఉత్కర్ష్రెడ్డి 591, వై నమ్రతసాయి 590, పీ బాలు 590, కే అభిజ్ఞ 590 మార్కులు సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. 580కిపైగా మార్కులను 103 మంది, 570కి పైగా 278మంది, 550కి పైగా 780మంది, 500కి పైగా 1,669 మంది విద్యార్థులు మా ర్కులు సాధించినట్టు తెలిపారు. మ్యాథ్స్‌లో 90కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 1,034, సైన్స్‌లో 90కి పైగా సాధించిన విద్యార్థులు 802 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యార్థులు రికార్డు సృష్టించినట్టు వెల్లడించారు. విద్యార్థుల శ్రమ, ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే ఇలాంటి అద్భుత విజయాలు సాధించినట్టు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, ఎండీ భాష్యం సాకేత్‌రామ్, హైదరాబాద్ సీఈవో చైతన్య తదితరులు అభినందించారు.
టెన్త్ ఫలితాల్లో ఎస్సార్ విజయభేరి
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. 600 మార్కులకు సక్కార శివప్రియ 586, డీ దీక్షిత్‌రెడ్డి 586, ఎస్ మనస్విని 585, మణివర్ధన్ 584, శివచరణ్ 584, వీ హాసిని 584 సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారని విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి పేర్కొన్నారు. 580కిపైగా మార్కులను 23 మంది సాధించారని తెలిపారు. అఖండ విజయాన్ని సాధించిన విద్యార్థులకు, అధ్యాపక బృందానికి వరదారెడ్డితోపాటు డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
పది ఫలితాల్లో అల్ఫోర్స్ అగ్రగామి
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 30 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పది ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయని, సంచలనాత్మక ఫలితాలకు నిర్వచనం అల్ఫోర్స్ అని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మారులు సాధించిన విద్యార్థులను కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనిటాట్స్ ప్రాంగణంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలకు చెందిన బీ సాత్విక్ 589, ఏ విష్ణుప్రియ, కే శివరాణి, 588, కే ఐశ్వర్య 587, ఎన్ సాత్విక్ 586, ఏ అన్విత్ 586, వీ అక్షర 585, జీ సహస్ర 585, 580 మారులకు పైగా 35 మంది, 570కిపైగా 110 మంది మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులకు అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
‘పది’ ఫలితాల్లో గురుకులాల ప్రభంజనం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తెలంగాణ గురుకులాలు ప్రభంజనం సృష్టించాయి. బీసీ గురుకులాల విద్యార్థులు మొత్తం 17,431 మంది పరీక్షలకు హాజరు కాగా 17,046 మంది (97.79 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 143 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.