కమాన్చౌరస్తా, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించినట్టు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందిస్తేనే సంచలనాత్మక విజయాలు సాధిస్తార ని చెప్పారు. సెకండియర్ బైపీసీలో జే అంజన 997 మారులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు.
కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు 990, ఆపై మా రులు సాధించడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. ఎంఈసీ విభాగంలో వీ అక్షయ్వర్థన్ 988, వీ రిషీత 988మారులు సాధించారని, సీఈసీలో బీ గ్రీష్మ 987 మారులు సాధించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే ఫస్టియర్ ఎంపీసీలో మొత్తం 20మంది విద్యార్థులు 468 మారులు సాధించారని నరేందర్రెడ్డి వివరించారు. 66మంది విద్యార్థులకు 467 మారులు వచ్చాయని పేర్కొన్నారు. బైపీసీలో నభిలాతరీమ్కు 438, జోహ మహవీశ్ 438, సామాపిరదోశ్ 438 మారు లు సాధించారని తెలిపారు. ఎంఈసీలో ఆర్ చిద్విలాస 491, బీఈసీలో పీ భవజ్ఞ 493 మారులు సాధించారని ఆయన వెల్లడించారు.