హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా కమలాపూర్ జడ్పీ పాఠశాలలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీకి పాల్పడ్డాడనే అభియోగాలపై డీబార్ అయిన దండబోయిన హరీశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. డీబార్ ఉత్తర్వులను గురువారం కొట్టివేసిన కోర్టు.. అతడి పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించాలని అధికారులను ఆదేశించింది.
కమలాపూర్ జడ్పీ బాలుర హైస్కూల్లో టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో హరీశ్‌ను అధికారులు గతంలో డీబార్ చేశారు. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు డీబాదర్ ఉత్తర్వులను కొట్టివేసింది.