బాసర, ఫిబ్రవరి 7 : తమను అన్యాయంగా ఫెయిల్ చేశారంటూ శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (సీవోఈ) ఆఫీసు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. మూల్యాంకనంలో కోడింగ్, డీకోడింగ్ వల్ల తమకు అన్యాయం జరిగిందని, వాస్తవానికి తాము ఉత్తీర్ణులయ్యమని చెప్పారు. తమకు న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ట్రిపుల్ఐటీ ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ గోవర్ధన్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేసినా స్పందించలేదు. నిజనిర్ధారణ కమిటీ వేసినట్టు సమాచారం.