కోస్గి/భద్రాద్రి కొత్తగూడెం/పెద్దఅంబర్‌పేట/కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఆగస్టు 22 : పాలిటెక్నిక్ పాలిట శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గిలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శివరాజ్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు మహిపాల్, బీఆర్ఎస్ కోస్గి ఇన్చార్జి వెంకట్ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా సంజయ్‌గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ ఆందోళన చేపట్టారు.