Achampet | అచ్చంపేట రూరల్, డిసెంబర్ 6: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పుల్జాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినికి పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో 3వ తరగతి చ దువుతున్న సరిత శుక్రవారం ఉదయం ఇంటర్వెల్ సమయంలో ఆడుకుంటూ భవనానికి ఉన్న రెండు పిల్లర్ల మధ్య తల పెట్టడంతో ఇరుక్కుపోయింది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు, భవన నిర్మాణ మేస్త్రీలు శ్రమించి పిల్లర్లను కొంత మేర ధ్వంసం చేసి విద్యార్థినిని సురక్షితంగా బయటకు తీశారు.