గుండాల, జూలై 16 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయనపల్లిలో తోలెం నిహారిక (13) కస్తూర్బా లో 8వ తరగతి చదువుతున్నది. రెండు రోజుల క్రితం హోమ్ సిక్నెస్తో ఇంటికి వచ్చింది.
పాఠశాలకు వెళ్లాలని కుటుంబ సభ్యులు మంగళవారం మందలించడంతో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ దబాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజమౌళి తెలిపారు.