సూర్యాపేట టౌన్, జనవరి 20 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీసీ గురుకుల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. పట్టణ పరిధిలోని బీబీగూడేనికి చెందిన వల్లపు సైదులు పెద్ద కూతురు సంగీత ఇదే గురుకులంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం, రెండో కూతురు హర్షిత 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ సంక్రాంతికి ఇంటికి వెళ్లగా, సెలవులు ముగియడంతో తల్లిదండ్రులు సోమవారం వారిని పాఠశాలలో వదిలివెళ్లారు. సంగీత క్లాస్‌కు వెళ్లగా హర్షిత గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. తోటి విద్యార్థినులు గమనించి టీచర్లకు చెప్పగా వారు వచ్చి హర్షితను కిందకు దింపారు. తల్లిదండ్రులకు విషయం చెప్పి సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హర్షిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉన్నది.
భార్య వేధింపులకు మరొకరు బలి ; మధ్యప్రదేశ్‌లో యువకుడి ఆత్మహత్య
భోపాల్: భార్య వేధింపులకు మరొకరు బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి భార్య, ఆమె బంధువులే కారణమని పేర్కొంటూ బలవన్మరణానికి ముందు వీడియో రికార్డు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. బ్యౌరా పట్టణంలో ఆదివారం రవి కశ్యప్(27) తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అంతకుముందు ఆయన తన ఫోన్లో చిత్రీకరించిన వీడియోలో తన భార్య, ఆమె బంధువులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తన భార్య 15 రోజులకోసారి ఆమె పుట్టింటికి వెళ్లి తిరిగివచ్చి, తన కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నదని తెలిపారు. ఆమె బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.